Happy Birthday Brahmanandam: Not just an ace comedian, he is also a fantastic portrait artist
#Brahmanandam
#HbdBrahmanandam
#Tollywood

బ్రహ్మానందం.. తెలుగు వాళ్లకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతేకాదు, ఆ పేరు వినగానే మన పెదాలపై నవ్వులు చిగురిస్తుంటాయి. సినిమాల్లో ఆయన ఎంట్రీకి కేకలు వినిపిస్తుంటాయి. దేశ వ్యాప్తంగా ఆయనకున్న ఫాలోయింగ్‌కు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంతలా దాదాపు నలభై ఏళ్లుగా సినీ రంగానికి విశిష్టమైన సేవలు అందిస్తూ రికార్డులు, అవార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడీ హాస్యబ్రహ్మ. సుదీర్ఘ కాలంగా తెలుగు వాళ్లకు నవ్వులు పంచుతోన్న బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి!